మోడీ, కేసీఆర్ ఇద్దరు దొంగలే.. వాళ్లు దోచిపెట్టేది అదానిలకే : కోమటిరెడ్డి

by Disha Web Desk 2 |
మోడీ, కేసీఆర్ ఇద్దరు దొంగలే.. వాళ్లు దోచిపెట్టేది అదానిలకే : కోమటిరెడ్డి
X

దిశ, భువనగిరి రూరల్ : రాష్ట్రంలో కేసీఆర్, బీజేపీలు పోటీపడి మరి సభలు పెట్టారని, అవసరం లేకున్నా కేసీఆర్ రాష్ట్రపతి అభ్యర్థిని పిలిపించి రూ.50 కోట్ల ప్రజాధనంతో హడావుడి చేశారని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్​ అయ్యారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలం రామలింగంపల్లి గ్రామంలో బాబు జగ్జీవన్ రావ్, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అహ్మదాబాద్ ని అదాని బాద్‌గా మార్చుకోమని మోడీని అంటున్న కేటీఆర్ హైదరాబాద్‌ని కూడా అదానిబాద్‌గా మార్చాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

కేటీఆర్ అదాని కంపెనీతో కలిసి తమ బంధువు ప్రతిభా శ్రీనివాసరావుకు రూ.60 వేల కోట్లకు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో చేస్తున్నది ఏమిటని, సింగరేణిలోని గోల్డ్ మైన్ గురించి ఏం చెపుతారని ఆయన ప్రశ్నించారు. రూ.20 వేల కోట్లకు చేయటానికి కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్న కూడా కేసీఆర్, కేటీఆర్ తమ స్వార్థం కోసం 60 వేల కోట్లకు ఇస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాను కోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు తెలిపారు.

అదేవిధంగా ప్రధానమంత్రితో పాటు సీఐడీని కూడా కలిసి తెలంగాణలోని పరిస్థితులను వివరించినట్లు తెలిపారు. కేంద్రం పై విమర్శలు చేస్తునటువంటి కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు కూడా దోచిపెట్టేది అదానిలకే అని దానికి తానే సాక్ష్యమని అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లైనా సింగరేణి గోల్డ్ మైన్ కాంట్రాక్టును నిలిపివేసి రూ.40 వేల ప్రజాధనాన్ని కాపాడుతానని, పార్లమెంట్ లో తన గళం విప్పి తెలంగాణ ప్రభుత్వం చేస్తునటువంటి అవినీతి అడ్డుకుంటానని అన్నారు.


Next Story

Most Viewed