కార్తి సడెన్ డెసిషన్.. విడుదలకు సిద్ధమైన 'విరుమన్'

by Disha Web Desk 16 |
కార్తి సడెన్ డెసిషన్.. విడుదలకు సిద్ధమైన విరుమన్
X

దిశ, సినిమా : కోలీవుడ్ హీరో కార్తి చివరగా 2021‌లో 'సుల్తాన్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత ప్రస్తుతం 'విరుమన్' చిత్రంతో రానున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. 'విరుమన్' సినిమాను ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది. విడుదలకు సిద్ధంగా ఉన్న విశాల్ 'లాఠీ' మూవీ హఠాత్తుగా రేస్ నుంచి తప్పుకుంది. విక్రమ్ 'కోబ్రా' మూవీ కూడా పక్కకు తప్పుకుంది. ఈ రెండు సినిమాలు డ్రాప్ అవడంతో ఆ గ్యాప్‌ను హీరో కార్తి వాడుకోన్నున్నాడు. మరో విషయం ఏంటంటే 'ఇండిపెండెన్స్ డే' సందర్భంగా ఈసారి నాలుగు రోజుల సెలవులు రావడంతో.. 'మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2' సినిమాలు కూడా రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. కానీ వాటి వల్ల కార్తికి పెద్ద సమస్య ఉండకపోవచ్చు. కానీ థియేటర్స్ లెక్కల ప్రకారం ఇది కొంత రిస్క్ ఫ్యాక్టరే.

Next Story

Most Viewed