Jayamma Panchayathi: పంచాయితీకెక్కిన సుమ కనకాల.. పరిష్కారం దొరికేనా ?

by Dishanational2 |
Jayamma Panchayathi: పంచాయితీకెక్కిన సుమ కనకాల.. పరిష్కారం దొరికేనా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : మాటలతో మాయ, అదిరిపోయే పంచ్‌లు వేసే సీనియర్ యాంకర్ సుమ నటిస్తోన్న జయమ్మ పంచాయితీ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు విజయ్ కుమార్ దర్శకత్వం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా, ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన లభించింది. ఇక ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు.

ఇక భర్త అనారోగ్యం పాలయ్యేంత వరకు సంతోషకరమైన జీవితాన్ని గడిపే సాధారణ గృహిణిగా ఈ సినిమాలో సుమ కనిపించనుంది. ఆమె తన సమస్యను గ్రామ పంచాయితీ ముందకు తీసుకెళ్తుంది. అయినప్పటికీ దాన్ని వారు సమస్యగా పరిగణించలేరు. దీంతో సుమ తన సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుంది అనేదే మిగితా కథ. ఇక ట్రైలర్‌లో సినిమాలోని ఇతర పాత్రలను కూడా చూపించారు. ఈ మూవీ మొత్తం ప్రత్యేకమైన సెటప్‌తో ఉల్లాసకరమైన పల్లెటూరి డ్రామాగా.. ట్రైలర్‌లో కనిపిస్తోంది. ఇక మే6న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

https://youtu.be/iycJ-_VCHm8

Next Story

Most Viewed