'అది యూకే అంతర్గత విషయం' విదేశాంగ ప్రతినిధి : అరిందమ్ బాగ్చీ

by Dishanational1 |
అది యూకే అంతర్గత విషయం విదేశాంగ ప్రతినిధి : అరిందమ్ బాగ్చీ
X

న్యూఢిల్లీ: యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామాపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. యూకే ప్రభుత్వంలో మార్పు ఆ దేశ అంతర్గత అంశమని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ యూకేలో జరుగుతున్న పరిణామాలను భారత్ దగ్గరి నుంచి పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రధాని మోడీకి, యూకే ప్రధాని జాన్సన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాలు మధ్య విస్తృత భాగస్వామ్యాన్ని కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికార మార్పు తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పారు. మరోవైపు యూకే ప్రధాని బోరిస్ రాజీనామాపై రష్యా హర్షం వ్యక్తం చేసింది. బోరిస్ రష్యాను ఇష్టపడడని, తాము కూడా అతన్ని ఇష్టపడమని అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు.


Next Story

Most Viewed