- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాస్టళ్లలో ‘డాగ్ స్క్వాడ్’తో తనిఖీలు
మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా గంగాధర ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 'యాంటీ డ్రగ్స్' అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

దిశ, గంగాధర : మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా గంగాధర ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 'యాంటీ డ్రగ్స్' అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే శారీరక, మానసిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
అనంతరం పోలీసు సిబ్బంది డాగ్ స్క్వాడ్ (జాగిలాల) బృందంతో కలిసి బాలుర హాస్టల్ గదులు, పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విద్యాసంస్థలు, హాస్టళ్లలో మాదక ద్రవ్యాలకు తావులేకుండా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్సై హెచ్చరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి చదువు, క్రీడల్లో రాణించాలని, డ్రగ్స్ రహిత సమాజం కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోస్టర్ తయారీ, నినాదాల రచన, చర్చా పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






