2022-23 లో 55 వేల కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లను తీసుకుంటాం: ఇన్ఫోసిస్ సీఈఓ!

by Web Desk |
2022-23 లో 55 వేల కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లను తీసుకుంటాం: ఇన్ఫోసిస్ సీఈఓ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా 55,000కి పైగా ఫ్రెషర్లను తీసుకోనున్నట్టు వెల్లడించింది. కొత్త నియామకాల ద్వారా వృద్ధిని మరింత వేగవంతం చేయవచ్చని కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ అన్నారు.

పరిశ్రమల సంఘం నాస్కామ్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టెక్ రంగంలో ఇంజనీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్‌లకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, తక్కువ వ్యవధిలో కొత్త నైపుణ్యాలను నేర్చుకునే వారికి మెరుగైన అవకాశాలు లభించనున్నాయని సలీల్ పరేఖ్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 55 వేల నియామకాలు చేపట్టామని, రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇంకా ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయంలో 20 శాతం వృద్ధి లక్ష్యంగా కలిగి ఉన్నట్టు, ఈ నేపథ్యంలో కంపెనీలోకి రాబోయే ఫ్రెషర్స్ ఇది సరైన సమయంగా భావించవచ్చని పరేఖ్ అన్నారు. మెరుగైన నైపుణ్యం ఉన్న వారిని తీసుకున్న తర్వాత వారికి 6-12 వారాల ప్రత్యేక శిక్షణ ఉండనుందన్నారు. ఇన్ఫోసిస్ భవిష్యత్తులో వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్న క్లౌడ్ సేవలపై దృష్టి సారించింది. దీనికి సంబంధించిన నైపుణ్యం ఉన్నవారిని తీసుకోవాలనుకుంటున్నామని పరేఖ్ వెల్లడించారు.


Next Story

Most Viewed