జర్మనీతో పోరుకు 'సై'.. 22 మందితో ఇండియా రెడీ

by Dishafeatures2 |
జర్మనీతో పోరుకు సై.. 22 మందితో ఇండియా రెడీ
X

భువనేశ్వర్ : ఎఫ్‌ఐహెచ్ ప్రో హకీ టోర్నమెంట్‌లో భాగంగాలో ఈనెల14 జర్మనీతో తలపడేందుకు టీమిండియా హకీ జట్టు సిద్ధమైంది. అందుకోసం 22 మందితో కూడిన జట్టును హాకీ ఇండియా సోమవారం ప్రకటించింది. దీనికి అమిత్ రోహిదాస్ నాయకత్వం వహిస్తుండగా, హర్మన్ ప్రీత్ సింగ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 22 మంది స్వ్కాడ్ లో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్, కిషన్ బహదూర్ పటాక్, డిఫెండర్స్ వరుణ్ కుమార్, అమిత్ రోహిదాస్, సురేందర్ కుమార్, జుగ్రాజ్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్, జర్మన్ ప్రీత్ సింగ్, గురిందర్ సింగ్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఇక మిడి ఫీల్డ్‌లో నీలకంఠ శర్మ, మన్ ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, షంషేర్ సింగ్, హార్దిక్ సింగ్, రబిక్ చంద్ర సింగ్, ఫార్వార్డ్‌లో సుక్జిత్ సింగ్, అభిషేక్, మనిదీప్ సింగ్, షీలానంద్ లక్రా, దీల్ ప్రీత్ సింగ్, లిలిత్ కుమార్, అర్షదీప్‌లు ఉన్నారు.

చీఫ్ కోచ్ గ్రహమ్ రియడ్ మాట్లాడుతూ.. ఎఫ్‌ఐహెచ్ ప్రో హకీ లీగ్‌లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోందన్నారు. ఇది టీమిండియా ఆటగాళ్లు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు, తప్పులను, బలహీనలతను కనిపెట్టి సరిదిద్దుకునే మంచి అవకాశాన్ని కల్పించిందని చెప్పారు. వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా 21 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుందని వివరించారు. అయితే, జర్మనీ 17 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ జట్టుతో టీమిండియాకు సవాల్ విసిరే అవకాశం ఉందని, తుదిపోరులో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుతుస్తుందని హెడ్ కోచ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.



Next Story