చండీగఢ్‌ను పంజాబ్‌కు బదిలీ చేయండి: అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

by Disha Web Desk 17 |
చండీగఢ్‌ను పంజాబ్‌కు బదిలీ చేయండి: అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
X

అమృత్‌సర్: ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగానే కీలక తీర్మానం చేసింది. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న చండీగఢ్‌ను పంజాబ్‌కు బదిలీ చేయాలని పంజాబ్ అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కేంద్రపాలిత ప్రాంతాన్ని నిర్వహించడంలో సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీంతో కేంద్రానికి, పంజాబ్ ప్రభుత్వానికి మధ్య సరికొత్త యుద్దానికి తెరలేపింది. తీర్మానానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు. పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966 ప్రకారం, పంజాబ్ రాష్ట్రాన్ని హర్యానా రాష్ట్రంగా, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగానూ విభజించినట్లు సీఎం భగవంత్ మాన్ తెలిపారు.

ఇక, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలను అప్పటి కేంద్ర పాలిత ప్రాంతం హిమాచల్ ప్రదేశ్‌గా మార్చారని, అప్పటి నుంచి పంజాబ్, హర్యానా రాష్ట్ర నామినీలకు కొంత నిష్పత్తిలో మేనేజ్‌మెంట్ స్థానాలను ఇవ్వడం ద్వారా ఉమ్మడి ఆస్తులలో బ్యాలెన్స్ ఉందని భగవంత్ మాన్ తెలిపారు. అయితే కేంద్రం మాత్రం దీనిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం చండీగఢ్‌కు బయటి అధికారులను నియమించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ప్రయోజనాలను ప్రకటించింది. అయితే ఇది పంజాబ్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విపక్షాలు ఆరోపించాయి.

Next Story

Most Viewed