దిశ జర్నలిస్టుపై దాడి అమానుషం : ఎమ్మెల్యే కోరం కనకయ్య

by Kalyani |
దిశ జర్నలిస్టుపై దాడి అమానుషం : ఎమ్మెల్యే కోరం కనకయ్య
X

దిశ ,బయ్యారం : బయ్యారం దిశ జర్నలిస్టుపై ఈనెల 13 న పోలింగ్ రోజు దాడి అమానుష సంఘటన అని విలేకరుల పై దాడులు ఎవరు చేసినా సహించరానదని ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య అన్నారు. మండల కేంద్రంలో విబిటి ఫంక్షన్లలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సందర్భంగా మండల విలేకరులతో మాట మంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ముచ్చటించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సమాజానికి ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న వారిపై దాడులు చేయడం ,సరైన పద్ధతి కాదని దాడిని తీవ్రంగా ఖండించారు.

మండలంలో ఏ సంఘటన చోటు ఛేసుకున్నా , ఇరువురు సామరస్యంగా పరిష్కరించుకోవాలి…అలా కాకుండా ఎన్నికల నియమ నిబంధనలు ఖాతరు చేస్తూ..చట్టాన్ని చేతులోకి తీసుకోవడం హేయమైన చర్యగా తెలిపారు. సమాజంలో నాయకులుగా చెలామణి కొనసాగే వారు ఇలాంటి సంఘటన లు చోటు చేసుకోవడం దురదృష్టకరమని తెలిపారు. జర్నలిస్టుల పై దాడులను ఎవరు సమర్దించిన చట్ట పరంగా నేరం అని అన్నారు.బాధితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, భూక్యా ప్రవీణ్ నాయక్ ,తమ్మిశెట్టి వెంకటపతి ,వేల్పుల శ్రీను ,మోహన్ ,తదితరులు పాల్గొన్నారు.

Next Story