టీఆర్ఎస్‌లోకి వెళ్తా.. ఎన్నికల్లో పోటీ చేయను : జగ్గారెడ్డి

by Disha Web Desk |
టీఆర్ఎస్‌లోకి వెళ్తా.. ఎన్నికల్లో పోటీ చేయను : జగ్గారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : గత వారం రోజులుగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం జరిగిన సెషన్స్‌‌ సమయంలో మీడియా పాయంట్ వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఉద్యమంలో పనిచేసిన జర్నలిస్టులకు ఇండ్లు , కారు ఇస్తే.. నేను టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి రెడీ అని, వాళ్లు గృహ ప్రవేశం చేయగానే వస్తానని, దీనికి మీరు సిద్ధమేనా అని జగ్గారెడ్డి.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ప్రశ్నించారు. మీరు పోటీ చేయొద్దంటే అవసరం అనుకుంటే ఒక టర్మ్ పోటీ చేయను అని ప్రకటించారు. ఇదే సమయంలో అక్కడకి వచ్చిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కల్పించుకుని జగ్గన్న మా వాడే.. అక్కడున్నా.. ఎక్కడున్నా జగ్గన్న మాలో వాడే.. అని అన్నారు.

ఇదిలా ఉండగా.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి మధ్య చర్చ నడిచింది. తెలంగాణ కోసం త్యాగం చేసిన కుటుంబం మాది. మా 12 మంది ఎంపీలు లేకుంటే తెలంగాణ వచ్చేదా అని కోమటి రెడ్డి ప్రశ్నించారు. దీనికి జీవన్ రెడ్డి స్పందిస్తూ.. మీరే తెలంగాణ తెస్తే 2014లో మీ పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేదన్నారు. రాజగోపాల్ రెడ్డి బదులిస్తూ.. మీలాగా కాంగ్రెస్ ప్రజలకు అబద్ధాలు చెప్పలేదన్నారు. మావి అబద్ధాలు అని మీరు ఇన్నేండ్లు చెప్పినా ప్రజలు ఎందుకు నమలేదన్న జీవన్ రెడ్డి అనగా.. మేము కొన్ని తప్పులు చేసినం.. మీరు అబద్దాలతో ఓట్లు వేయించుకున్నారని రాజగోపాల్ రెడ్డి ముగింపు పలికారు.


ఓ అగ్ర పారిశ్రామికవేత్త ఆయన భార్యతో పడుకోవాలని కోరాడు': తహసీన్ పూనావాలా

Next Story

Most Viewed