వీరాసనం హీరో ఫోజ్ ఎలా చేయాలి ఉపయోగాలేంటి?

by Disha Web |
వీరాసనం హీరో ఫోజ్ ఎలా చేయాలి ఉపయోగాలేంటి?
X

దిశ, ఫీచర్స్: ఈ ఆసనంలో మొదటగా బల్లపరుపు నేలపై వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత శరీరాన్ని వెనకకు నేలపైకి వంచాలి. రెండు చేతులను బాడీకి ఇరువైపుల పెట్టి కాసేపు ఆగాలి. ఇప్పుడు రెండు అరచేతులను భుజాలపైనుంచి నేలమీద ఆన్చి శరీరాన్ని పైకి గాల్లోకి లేపాలి. తల, పాదాలు, మోకాళ్ల వరకూ కాళ్లు నేలమీదనే ఉంచి శరీరాన్ని మాత్రమే పైకెత్తాలి. ఇప్పుడు శరీరభారమంతా తలపై వేసి రెండు చేతులను జోడించి ముందుకు చాచి నమస్కారం చేస్తున్నట్లు పెట్టాలి. ఇలా కాసేపు ఆగి పూర్వ స్థితిలోకి వచ్చి రిలాక్స్ అవ్వాలి.

ప్రయోజనాలేంటి?

* తొడలు, మోకాలు, చీలమండలాన్ని సాగదీస్తుంది.

* గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

* మెనోపాజ్ లక్షణాలను దూరం చేయడంలో సాయం.

* అధిక రక్తపోటు, ఆస్తమాకు మంచి చికిత్స.



Next Story