గర్జించిన గుజరాత్.. దీపక్ హుడా, బదోని అర్థసెంచరీలు వృధా

by Disha Web Desk 12 |
గర్జించిన గుజరాత్.. దీపక్ హుడా, బదోని అర్థసెంచరీలు వృధా
X

ముంబై : ఐపీఎల్ సీజన్-15 లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్, లక్నో జట్టు వాంఖడే స్టేడియం వేదికగా తొలిరోజు సందడి చేశాయి. ఎన్నో అంచనాల మధ్య మైదానం లోకి అడుగుపెట్టిన లక్నో సూపర్ జాయంట్స్ జట్టు ఆశించినంతగా రాణించలేకపోయింది. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమవడంతో తక్కువ స్కోరుకే లక్నో ఆటగాళ్లు వెనుదిరిగారు. దీంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గుజరాత్ టైటాన్స్ జట్టు బోణి కొట్టింది.

ఐపీఎల్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. గత సీజన్లో దిగ్గజ టీములుగా, డిఫెండింగ్ చాంపియన్ గా పేరుగాంచిన చెన్నై, ముంబై సహా ఆర్సీబీ జట్లు తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాభావాన్ని చవిచూశాయి. ఈ జట్లకు సీనియర్ సారధులు ఉన్నారు. అయితే, ఎటువంటి నాయకత్వ అనుభవం లేకుండా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 158-6 పరుగులు మాత్రమే చేసింది. రాహుల్ సేన విధించిన లక్ష్యాన్ని టైటాన్స్ టీం కేవలం 19.4 ఓవర్లలోనే ఛేదించి గ్రాండ్ విక్టరీ అందుకుంది.

కుప్పకూలిన లక్నో టాప్ ఆర్డర్

టైటాన్స్ బౌలర్ల దెబ్బకు లక్నో జాయంట్స్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను పేసర్ షమీ డక్కౌట్ చేశాడు. ఆ తర్వాత మరో కీలక బ్యాటర్లు డికాక్, మనీష్ పాండేను షమీ ఘోరంగా దెబ్బ తీయడంతో కేవలం 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. అనంతరం దీపక్ హుడా 55/41, ఆయుష్ బదోని 54/41 లక్నో జట్టును ముందుండి నడిపించారు. చెరో అర్ధ సెంచరీ సాధించి గౌరవప్రదమైన స్కోరును రాబట్టారు. అయితే, లక్నో బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగా కనిపించిన టైటాన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాహుల్ సేనకు పరాభవం తప్పలేదు.

సమిష్టి పోరుతో టైటాన్స్ అవలీలగా..

లక్నో జట్టుతో పోలిస్తే గుజరాత్ టైటాన్స్ కొంత బలహీనంగా కనిపించినప్పటికీ మంచి బౌలింగ్ లెన్త్, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో హార్దిక్ సేన తొలి విజయాన్ని కైవసం చేసుకుంది. టైటాన్స్ జట్టులో మాథ్యూ వేడ్ 30/29, హార్దిక్ పాండ్యా 33/28, డేవిడ్ మిల్లర్ 30/21, రాహుల్ తేవాటియా 40/24 అద్భుత ప్రదర్శన చేశారు. ఒకానొక టైంలో గుజరాత్ టాప్ ఆర్డర్ చేతులెత్తేయగా మిల్లర్, తేవాటియా లక్నో ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. 17.3 ఓవర్లో ఆవేశ్ ఖాన్ వేసిన బంతికి మిల్లర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరుగగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అభినవ్ దూకుడుగా ఆడి 15/7 జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

స్కోర్ బోర్డు :

లక్నో సూపర్ జాయంట్స్ : 158/6 (20)

ఇన్నింగ్స్ : కేఎల్ రాహుల్ 0 (బి) షమీ, డికాక్ 7 (బి)షమీ, లూయిస్ 10 (బి) ఆరోన్, మనీష్ పాండే 6 (బి) షమీ, దీపక్ హుడా 55 (బి) రషీద్ ఖాన్, ఆయుష్ బదోని 54 (బి) ఆరోన్, కృనాల్ పాండ్యా 21 నాటౌట్, దుష్మంత చమీరా 1 నాటౌట్

వికెట్ల పతనం : 0-1,13-2,20-3,29-4,116-5,156-6

బౌలింగ్ : షమీ (4-0-25-3), ఆరోన్ (4-0-45-2),ఫెర్గూసన్ (4-0-24-0), హార్దిక్ పాండ్యా (4-0-37-0), రషీద్ ఖాన్ (4-0-27-1)

గుజరాత్ టైటాన్స్ : 164/5(19.4)

ఇన్నింగ్స్ : శుభమన్ గిల్ 0 (బి) చమీరా, మాథ్యూ వేడ్ 30 (బి) దీపక్ హుడా, విజయ్ శంకర్ 4 (బి) చమీరా, హార్దిక్ పాండ్యా 33 (బి) కృనాల్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ 30 (బి) ఆవేశ్ ఖాన్, రాహుల్ తేవాటియా 40 నాటౌట్, అభినవ్ మనోహర్ 15 నాటౌట్

వికెట్ల పతనం : 4-1,15-2,72-3,78-4,138-5

బౌలింగ్ : దుష్మంత చమీరా (3-0-22-2), ఆవేశ్ ఖాన్ (3.4-0-33-1), మోహసిన్ ఖాన్ (2-0-18-0), రవి బిష్ణోయ్ (4-0-34-0), కృనాల్ పాండ్యా (4-0-17-1), దీపక్ హుడా (3-0-31-1)Ś



Next Story