ఆన్‌లైన్ గేమ్స్, క్యాసినో, రేస్ కోర్స్‌లపై 28 శాతం జీఎస్టీ అమలు వాయిదా!

by Disha Web |
ఆన్‌లైన్ గేమ్స్, క్యాసినో, రేస్ కోర్స్‌లపై 28 శాతం జీఎస్టీ అమలు వాయిదా!
X

చండీగఢ్: రెండు రోజుల పాటు జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం బుధవారం ముగిసింది. ఈ క్రమంలో క్యాసినో, ఆన్‌లైన్ గేమ్స్, రేస్ కొర్స్, లాటరీలపై 28 శాతం జీఎస్టీ అమలును వాయిదా వేస్తూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. భాగస్వామ్య పక్షాలతో మళ్లీ విస్తృతంగా చర్చించిన తర్వాత నివేదిక ఇవ్వాలని మంత్రుల బృందానిక్ మండలి సూచించింది. దీన్ని వచ్చే నెల 15 నాటికి సమర్పించాలని కోరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు. ఇదివరకు మంత్రుల బృందం ఆన్‌లైన్ గేమ్స్‌లో పాల్గొంచే వ్యక్తి చెల్లించే ఎంట్రీ ఫీజుతో పాటు పూర్తి విలువపై జీఎస్టీ అమలు చేయాలని ప్రతిపాదించింది. అలాగే, దీనిపై తదుపరి ఆగష్టు మొదటి వారంలో మండలి సమావేశమవుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఇక, జీఎస్టీ మండలి 47వ సమావేశంలో తీసుకున్న కొన్ని ఇతర నిర్ణాల్లో, ఈ వ్యర్థాలపై జీఎస్టీని 5 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డేఐ, ఎఫ్ఎస్ఎస్ఏఐ అందించే సేవలకు మినహాయింపు తొలగించారు. చక్కెర, సహజమైన ఫైబర్ లానంటి వస్తువుల నిల్వ, గిడ్డంగులపై జీఎస్టీ మీనహాయింపు వెనక్కి తీసుకున్నారు. ఎల్ఈడీ లైట్స్, ఇంక్, కత్తులు, బ్లేడ్స్, విద్యుత్‌తో నడిచే పంపులు, డైరీ మెషినరీలపై జీఎస్టీని 18 శాతానికి పెంచారు. సోలార్ వాటర్ హీటర్, ఫినిషింగ్ లెదర్‌పై 5 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని తీసుకున్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed