కొవిడ్-19 మందుల కోసం గ్రాన్యూల్స్ ఇండియాకు లైసెన్స్!

by Disha Web Desk 17 |
కొవిడ్-19 మందుల కోసం గ్రాన్యూల్స్ ఇండియాకు లైసెన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 చికిత్స కోసం రిటోనావిర్‌తో పాటు కో-ప్యాకేజ్‌లో వచ్చే ఫైజర్ ఓరల్ ట్రీట్‌మెంట్ నిర్మత్రెల్విర్ జెనరిక్ వెర్షన్‌లను తయారు చేయడానికి, మార్కెటింగ్ కోసం మెడిసిన్స్ పేటెంట్ పూల్(ఎంపీపీ) నుంచి లైసెన్స్ పొందినట్టు గ్రాన్యూల్స్ ఇండియా తెలిపింది. ఈ లైసెన్స్ నిర్మత్రెల్విర్, రిటోనావిర్ టాబ్లెట్ రూపంలో ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రేడియంట్స్‌), పూర్తయిన ఉత్పత్తులను రెండిటికీ వర్తిస్తాయి. నిర్మత్రెల్విర్ రిటోనావిర్‌తో కలిపి ప్రస్తుతం అమెరికా, కెనడా సహా అనేక దేశాల్లో పెద్దలు, పిల్లల్లో తేలికపాటి కొవిడ్-19 చికిత్స అత్యవసర వినియోగానికి ఆమోదం పొందింది.

యూఎస్‌ఎఫ్‌డీఏ (అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ) సహా గ్లోబల్ రెగ్యులేటరీ ఏజెన్సీల నుంచి ఆమోదం ఉన్న భారత్‌లోని గ్రాన్యూల్స్ తయారీ సెంటర్లలో వీటి ఉత్పత్తి ప్రారంభమవనుంది. అంతేకాకుండా గ్రాన్యూల్స్ ఇండియా అందుకున్న లైసెన్స్ ద్వారా భారత్ సహా అంతర్జాతీయంగా 94 దేశాల్లో ఉత్పత్తిని ప్రారంభించడానికి అనుమతి లభించినట్లు అయిందని కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed