ఎల్ఐసీ ఐపీఓను మేలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు!

by Disha Web Desk 17 |
ఎల్ఐసీ ఐపీఓను మేలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ ఐపీఓను వచ్చే నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆర్థిక సలహాదారులతో పాటు మర్చంట్ బ్యాంకర్లను సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఐపీఓలో విక్రయించాలని భావిస్తున్న వాటాను మరింత పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి సెబీకి దరఖాస్తు చేసిన వివరాల ప్రకారం.. ఎల్ఐసీలో 5 శాతం వాటాకు సమానంగా ఉన్న మొత్తం 31.6 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను, రూ. 10 ముఖ విలువతో విక్రయించడానికి అనుమతులు లభించాయి. కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికి మునుపే ఎల్ఐసీ ఐపీఓను ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. దీంతొ ఐపీఓను ప్రభుత్వం వాయిదా వేసింది. గత వారం రోజులుగా తిరిగి మార్కెట్లు మెరుగ్గా రాణిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు కూడా నెమ్మదిస్తున్న తరుణంలో ఐపీఓను మళ్లీ పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది.


Next Story

Most Viewed