- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందులతో మాజీ సర్పంచ్ ఆత్మహత్య
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ తన వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ తాళలేకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. పిట్టల సంపత్ 2014, 2019 సంవత్సరాల్లో మహమ్మదాపూర్ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. గ్రామాభివృద్ధి పనుల కోసం సొంత నిధులు ఖర్చు చేయడంతో పాటు పెద్ద మొత్తంలో అప్పులు చేసినట్లు సమాచారం. అయితే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో రాకపోవడం, అప్పులపై పెరిగిన వడ్డీల భారం కారణంగా ఆయన గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే సంపత్ అకాల మరణం చెందడంతో మహమ్మదాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే గ్రామస్థులు, పలువురు ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంపత్ మృతి పట్ల వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గాఢ సంతాపం తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.






