అమానుష ఘటన.. వైకుంఠ రథాన్ని 2 కిలోమీటర్లు నెట్టిన కుటుంబసభ్యులు

by Disha Web Desk 2 |
అమానుష ఘటన.. వైకుంఠ రథాన్ని 2 కిలోమీటర్లు నెట్టిన కుటుంబసభ్యులు
X

దిశ, సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో లేవని అధికార టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పలు చెప్పుకుంటున్నారు. చివరకు అంత్యక్రియలు కూడా సాఫీగా జరుగాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైకుంఠదామాలను అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇదేదో సాధారణ గ్రామంలో జరిగితే అంతగా ఆశ్చర్యపోవల్సిన విషయం కాదు కానీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో అంత్యక్రియల్లో అమానుష ఘటన వెలుగుజూసింది.

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్నబోనాల గ్రామంలో ఆదివారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. కళ్లముందే కొడుకు శవాన్ని చూసి తట్టుకోలేక ఆ తల్లిదండ్రలు కన్నీరుమున్నీరుగా విలపించారు. కనీసం అంతిమ యాత్రనైనా సాఫీగా చేయాలని భావించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని తెప్పించుకుని అంతిమ యాత్రను ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. అయితే, వైకుంఠ రథం మాత్రం శవాన్ని తరలించేందుకు మొరాయించింది. దీంతో చేసేదేంలేక శవాన్ని వాహనంలోకి ఎక్కంచి దాదాపు ఏడుస్తూనే రథాన్ని అర కిలోమిటరు వరకు నెట్టారు. మరో 200 మీటర్ల దూరం ఉన్న తరుణంలో పాడెను మోసుకుంటూ వెళ్లారు. అత్యంత దయనీయంగా ఉన్న ఈ చిత్రం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.


Next Story

Most Viewed