సహస్ర చండీ మహా యాగానికి ఏర్పాట్లు పూర్తి.. కుచాన్ పల్లికి చేరుకున్న మాధవ నంద స్వామి

by Dishafeatures2 |
సహస్ర చండీ మహా యాగానికి ఏర్పాట్లు పూర్తి.. కుచాన్ పల్లికి చేరుకున్న మాధవ నంద స్వామి
X

దిశ,మెదక్: సహస్ర చండీ మహాయాగం స్థలానికి పీఠాధిపతి సరస్వతి మాధవ నంద స్వామి శుక్రవారం చేరుకున్నారు. ఆయనకు యాగకర్త ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, లక్ష్మి దంపతులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణ ద్వారా స్వామివారు యాగశాలకు చేరుకున్నారు. యాగశాలలో యాగ నిర్వహణ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సుభాష్ రెడ్డి దంపతులకు ఆయన ఆశీర్వచనాలు అందించారు. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు గురు వందనం, గణపతి పూజ, స్వస్తివచనం, యాగశాల ప్రవేశం, దేవత ఆహ్వానం, రుద్ర, చండీ పారాయణం, అగ్ని ప్రతిష్ట, గణపతి రుద్ర, చండీ హవనం నిర్వహించనున్నట్లు వేద పండితులు తెలిపారు.

సహస్ర చండీ మహాయాగం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

శేరి సుభాష్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఈనెల 19 నుండి 23 వరకు నిర్వహించనున్న సహస్ర చండీ మహా యాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 10 యజ్ఞ కుండలాలు, 55 మంది ఋత్వికులు చండీయాగం నిర్వహణలో పాల్గొననున్నారు. 110 మందితో చండీ సప్తశతి జరగనుంది. దాదాపు 15 వేల మంది భక్తులు యాగ దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని నిర్వాహకులు తెలిపారు. వేల మంది భక్తులు పాల్గొననున్న మహా యాగంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. మెదక్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న మహా యాగంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని యాగ నిర్వాహకులు, సీఎం రాజకీయ కార్యదర్శి సుభాష్ రెడ్డి పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed