ఢిల్లీలో ఫ్లెక్సీల వార్.. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో సై అంటే సై అంటున్న పార్టీలు

by Disha Web |
ఢిల్లీలో ఫ్లెక్సీల వార్.. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో సై అంటే సై అంటున్న పార్టీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ బీజేపీల మధ్య పోరు రోజుకు తీవ్రమవుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలోనే మాటల యుద్ధం కొనసాగింది. కేవలం నిరసనలతోనే టీఆర్ఎస్ కార్యక్రమం చేపట్టింది. సోమవారం ఢిల్లీ వేదికగా తెలంగాణ భవన్లో నిరసన దీక్ష చేపట్టింది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. సమీపంలోనే బీజేపీ సైతం పోటీగా మూడు భాషల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.

చేతనైతే ధాన్యం కొనుగోలు చెయ్.. లేకపోతే గద్దె దిగు.. డ్రామాలు ఆపి ధాన్యం కొనుగోలు చెయ్.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరుతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయము వేడెక్కింది. మాటల యుద్ధం తోపాటు ఫ్లెక్సీల యుద్ధం ప్రారంభమైంది. ఢిల్లీలో సైతం బీజేపీ టీఆర్ఎస్ మధ్య ప్లెక్సీల పంచాయతీ మొదలైంది. తెలంగాణ భవన్ వద్ద కావాలని బీజేపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిందని టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది బీజేపీ రైతుపై వివక్షతను తెలియజేస్తుందని మండిపడ్డారు.


Next Story

Most Viewed