డిగ్రీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..

by Disha Web Desk 19 |
డిగ్రీ  ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీలలో ప్రవేశాలకై నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం హైదరాబాద్‌లోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రవేశ పరీక్షకు 18,498 మంది అమ్మాయిలు హాజరు కాగా.. 14,201 మంది (85% ), 2,495 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారన్నారు. అర్చన మొదటి ర్యాంకు సాధించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజీలు 30, ఎస్టీ మహిళా డిగ్రీ కాలేజీలు 15, ఎస్టీ బాలుర డిగ్రీ కాలేజీలు 7, మొత్తం 52 డిగ్రీ కాలేజీలు ఉన్నాయని, ఈ కళాశాలలో ప్రవేశాల కోసం ఇటీవల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీ యూజీసీఈటీ-2022) నిర్వహించామన్నారు. ఎస్సీ గురుకులాలకు సంబంధించిన ఫలితాలు, www.tswreis.ac.in ఎస్టీ గురుకులాలకు సంబంధించిన ఫలితాలను https://tgtwgurukulam.Telangana.gov.in వెబ్ సైట్స్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ , అధికారులు హన్మంతు నాయక్, ఎం.ప్రవీణ్, ప్రమోద్ కుమార్, శర్మ తదితరులున్నారు.



Next Story

Most Viewed