ఆర్‌బీఐ ఏప్రిల్‌ సమావేశంలో వృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని అంచనా!

by Disha Web Desk 17 |
ఆర్‌బీఐ ఏప్రిల్‌ సమావేశంలో వృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని అంచనా!
X

దిశ,వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఏప్రిల్, 2022 పాలసీ సమావేశంలో ద్రవ్యోల్బణ భయాల కంటే వృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరిలో కూరగాయల ధరలు పెరగడం వలన, వినియోగదారుల ధరల సూచీ (CPI) ఎలివేటెడ్ స్థాయిలోనే ఉంది. అంతేకాకుండా, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా తదుపరి నెలల్లో అధిక ముడి చమురు ధరల కారణంగా ద్రవ్యోల్బణం ఎలివేట్ లెవెల్స్‌లో ఉంటుందని అంచనా. "అయినప్పటికీ, RBI తన ఏప్రిల్ 2022 ద్రవ్య విధాన సమావేశంలో వృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని ఇప్పటికీ ఆశిస్తున్నాము, ఎందుకంటే ద్రవ్యోల్బణం కంటే వృద్ధి ఇప్పటికీ పెద్ద ఆందోళనగా ఉందని విశ్వసిస్తున్నాము" అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో, ఫిబ్రవరి 2022 లో CPI ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్ట స్థాయి 6.1 శాతంగా నమోదైంది. అంతేకాకుండా, ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరి 2022 లో 15 నెలల గరిష్ట స్థాయి 5.8 శాతానికి చేరుకుంది. ఇది ఒక నెల క్రితం 5.4 శాతంగా ఉంది. కూరగాయలు ప్రధానంగా ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమయ్యాయి. "వినియోగదారుల ధరల సూచీలో 17 శాతం బరువు ఉన్న తృణధాన్యాలు, ఉత్పత్తులు, మాంసం, చేపలు, సుగంధ ద్రవ్యాలు వంటి ఇతర అంశాలు కూడా అధిక ద్రవ్యోల్బణానికి దోహదపడ్డాయి".


Next Story

Most Viewed