'సీతా రామం'గా వచ్చేస్తున్న దుల్కర్ సల్మాన్..

by Disha Web |
సీతా రామంగా వచ్చేస్తున్న దుల్కర్ సల్మాన్..
X

దిశ, వెబ్‌డెస్క్: దుల్కర్ సల్మాన్.. ఈ పేరును తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. 'మహానటి' సినిమాలో కీర్తి సురేశ్ సరసన నటించి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులను దోచుకున్నాడు.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'సీతా రామం' ఈ చిత్రంలో నటిస్తున్నాడు. దుల్కర్ సరసన ఈ సినిమాలో మృణాళినీ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండా.. రష్మిక మందనా, సుమంత్ కీలక పాత్రలు పోషించారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు చిత్రబృందం. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 5 న తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed