ప్రభుత్వం జలవనరులను నిర్వీర్యం చేస్తోంది: దేవినేని ఉమ

by Disha Web |
ప్రభుత్వం జలవనరులను నిర్వీర్యం చేస్తోంది: దేవినేని ఉమ
X

దిశ, ఏపీ బ్యూరో : జగన్ ప్రభుత్వం జలవనరులను నిర్వీర్యం చేస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో జలవనరుల రంగంలో రూ. 67 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 62 ప్రాజెక్టులు చేపట్టి అందులో 23 ప్రాజెక్టు పూర్తి చేసి 32 లక్షల ఎకరాల ఆయకట్టును స్తిరీకరించమని వెల్లడించారు. ఏడు లక్షల ఎకరాల నూతన ఆయకట్టు రైతులకు అందించమని తెలిపారు. సీఎం జగన్ తన 34 నెలల పాలనలో రూ.9 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరం కూడా నూతన ఆయకట్టును రైతులకు అందించలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేవలం 41.5 మీటర్లకు పరిమితం చేసి నీళ్లు నిలబెట్టారని ఆరోపించారు. ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే నిర్వాసితుల కుటుంబ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో 30 వేల కోట్ల వరకు నిర్వాసితులకు ఇవ్వాల్సి ఉందన్నారు. ఆ సొమ్ము ఎప్పుడు ఇస్తారో సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


Next Story