మోడీకి ఓటు వేయడం 'ప్రమాదకరం': శరద్ పవార్

by Disha Web Desk 17 |
మోడీకి ఓటు వేయడం ప్రమాదకరం: శరద్ పవార్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని మోడీపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్‌లో ప్రభుత్వం నియంతృత్వాన్ని ప్రయోగిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి మళ్లీ అధికారంలోకి రావడం 'ప్రమాదకరం' అని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శరద్ పవార్ మాట్లాడుతూ, ఇటీవల కొంతమంది దేశంలో ఎన్నికలను పర్యవేక్షించడానికి వచ్చారు. వారిని నేను రెండు రోజుల క్రితం కలిశాను. మీరు భారతదేశాన్ని ఎందుకు సందర్శిస్తున్నారు? అని వారిని అడిగాను, అయితే దానికి సమాధానంగా వారు భారతదేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందో లేదో చూసేందుకు తాము వచ్చామని వారు నాతో చెప్పారు.

దేశంలో నియంతృత్వ పాలన సాగుతుంది. మళ్లీ మోడీ అధికారంలోకి వస్తే, నియంతృత్వం తిరిగి కొనసాగుతుంది. మోడీకి ఓటు వేయడం 'ప్రమాదకరం' అని శరద్ పవార్ అన్నారు. ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టింది. కేజ్రీవాల్ విద్య, ఆరోగ్య రంగాల్లో మంచి కృషి చేశారు. కానీ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినందున ఆయనను జైల్లో పెట్టారని, దేశంలో నియంతృత్వాన్ని తీసుకురావాలనుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలంటే, ప్రజలు మహా వికాస్ అఘాడి(ఎంవీఏ)కు ఓటు వేయాలని ఆయన అన్నారు.



Next Story

Most Viewed