మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరపడ్డాయి: మాజీ మంత్రి

by Dishanational1 |
మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరపడ్డాయి: మాజీ మంత్రి
X

దిశ, భిక్కనూరు: బంగారు తెలంగాణ చేస్తానన్న సీఎం కేసీఆర్ బంగారాన్ని గోదాంల కొద్దీ నిల్వలను జమ చేసుకుని, రాజ భోగాలు అనుభవిస్తున్నాడని మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా భిక్కనూరు మండలం భాగర్తిపల్లి, ఇస్సన్నపల్లి, ర్యాగట్లపల్లి, సిద్ధరామేశ్వర నగర్ గ్రామాల్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఒక్క డబుల్ బెడ్ రూమైన ఇచ్చాడా..? మూడెకరాల భూమి ఇచ్చాడా? ఏమీ ఇవ్వలేదు... నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, ఏమి ఇవ్వకుండానే మాటలతో గారడి చేస్తున్నాడని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు మాత్రం ఎక్కడపడితే అక్కడ భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడపడం వలన, యువకులతోపాటు ఎంతోమంది తాగుబోతులుగా మారి ఇంట్లోని విలువైన వస్తువులను అమ్ముకుంటూ కుటుంబాలను రోడ్డు పాలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరిని తాగుబోతులుగా మార్చి వారి ద్వారా వచ్చే పైకంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరపడ్డాయన్నారు. పార్టీలకతీతంగా సహాయం చేస్తున్న తనను ఎన్నికలు రాగానే మరిచిపోతున్నారని, కష్టాల్లో పాలుపంచుకుంటున్న తనను ఈసారైనా గెలిపించి, కర్ణుని శాపం నుంచి తనకు విముక్తి కలిగించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు, భూసారాన్ని బట్టి అన్ని రకాల పంటలను సాగు చేసుకోవచ్చన్నారు. రైతులకు ఇబ్బందిగా మారిన ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఏ పంట పండించిన కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.

ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మహమ్మద్ ఇలియాస్, టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా కిసాన్ విభాగం ఉపాధ్యక్షులు కుంట లింగారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపరి భీంరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మోహన్ రెడ్డి, బీసీ సెల్ మండల శాఖ అధ్యక్షులు వడ్ల తిరుమల స్వామి, మాజీ వైస్ ఎంపీపీ తాటిపాముల లింబాద్రి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందె దయాకర్ రెడ్డి, కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, వెంకమ్మ గారి బాగారెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయులు బాగారెడ్డి, అధికార ప్రతినిధి సత్యం, బల్యాల సుదర్శన్, అంకం రాజు, నాన్నగారి నరేందర్ రెడ్డి, కోటన్ స్వామి, ద్యాగల కిరణ్, జేపీ వెంకటేష్ గౌడ్, మహమ్మద్ సాజిద్, మద్దూరి రవి, కల్లూరి సిద్ధరాములు, దాసరి చిన్న రాజు రెడ్డి, జైపాల్ రెడ్డి, వడ్ల మల్లేశం, బత్తుల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed