నా భర్త ఓ విషపూరితమైన తండ్రి.. బాలీవుడ్ నటి

by Disha Web |
నా భర్త ఓ విషపూరితమైన తండ్రి.. బాలీవుడ్ నటి
X

దిశ, సినిమా: టెలివిజన్ యాక్ట్రెస్ చారో అసోపా భర్త రాజీవ్ సేన్‌ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె నిర్ణయంపై అభిమానుల నుంచి భారీ స్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. దీంతో మరోసారి స్పందించిన నటి.. తన యూట్యూట్ చానెల్ ద్వారా డివోర్స్ కారణాలను వెల్లడిస్తూ ఓ వీడియోను పంచుకుంది. ఈ మేరకు 'రాజీవ్‌కు విడాకులు ఇవ్వాలనే నిర్ణయం తప్పు అంటున్నారు. కానీ, నిజానికి రాజీవ్ నాకు సరైన భాగస్వామి కాదు. బాధ్యతాయుత తండ్రి కాదు. నా కూతురు జియానా మానసిక ప్రశాంతత కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నా. బాగా ఆలోచించే ఈ అడుగు వేస్తున్నా. నా బిడ్డను విషపూరితమైన వాతావరణంలో పెంచడం ఇష్టంలేదు. ప్రజలకు డివోర్స్‌పై ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయని తెలుసు. ఎవరూ తప్పుగా భావించొద్దు. నేను తొందరపడట్లేదు. చాలా క్లారిటీగా ముందుకెళ్తున్నా' అంటూ వివరించింది.

Next Story

Most Viewed