తండ్రిపేరు లేకుండా సర్టిఫికేట్స్ ఇవ్వాలని పిటిషన్.. హైకోర్టు సంచలన తీర్పు

by Disha Web |
తండ్రిపేరు లేకుండా సర్టిఫికేట్స్ ఇవ్వాలని పిటిషన్.. హైకోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని పలు కోర్టులు ఇటీవల సంచలన తీర్పులు ఇస్తున్నాయి. కొన్ని తీర్పులు జనాలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొన్ని తీర్పులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా మహిళల హక్కులు కాపాడే విధంగా ఉంటుండటంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. ఇటీవల పెళ్లికాని మహిళలకు జన్మించిన ఓ వ్యక్తి తన సర్టిఫికెట్లలో తండ్రి పేరు మూడు రకాలుగా ఉండడంతో ఆ వ్యక్తి కోర్టులో కేసు వేశాడు.

తండ్రి పేరు తొలగించి కేవలం తల్లి పేరు మాత్రమే ఉండేలా అవకాశం కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. దానిపై విచారించిన కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పెళ్లికాని మహిళలకు పుట్టిన పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లలో తండ్రి పేరు బదులు తల్లి పేరు మాత్రమే ఉండేందుకు అనుమతులు ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అత్యాచార బాధిత యువతులకు జన్మించిన పిల్లలకు దేశంలో అందరిలాగే ప్రాథమిక హక్కులైన గోప్యత, స్వేచ్చ, గౌరవంతో కూడిన జీవనం ఇవ్వాలని పేర్కొంది.



Next Story