- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతోంది: సామ రామ్మోహన్ రెడ్డి
కేటీఆర్ కామెంట్లపై టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కారుకు ఓటేయకపోతే కళ్ళు పోతాయని కేటీఆర్ శాపనార్థాలు పెడుతున్నాడు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్ కామెంట్లపై టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కారుకు ఓటేయకపోతే కళ్ళు పోతాయని కేటీఆర్ శాపనార్థాలు పెడుతున్నాడు. ఆయనకు వయసు పెరిగింది కానీ విజ్ఞత లేదని విమర్శలు గుప్పించారు. సోమవారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ మానసిక పరిస్థితి సరిగా లేదు..కేటీఆర్ సైకలాజికల్ గా ఇబ్బంది పడుతున్నాడు..తప్పుడు మెడిసిన్ తీసుకోవడం వల్లే కేటీఆర్ అలా మాట్లాడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు..దీని కోసం మెడిసిన్ పంపుతున్నట్లుగా ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేదాక కేటీఆర్ ఆగేలా లేరని, ఆ పార్టీ నాశనం కావడానికి కారణం కేటీఆర్ .. కేటీఆర్ పక్కన ఉన్న అనేక నాయకులు పొట్టిగా ఉన్నారని సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి..గజ్వేల్, సిరిసిల్లాలో ప్రజలు బీఆర్ఎస్ నేతలను తరుముతున్నారు..ప్రజలు తరిమితే మల్లన్న సాగర్ లో మునిగిన హరీష్ మంచిర్యాలలో తేలారని సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ మానసిక పరిస్థితిని బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాలని, కోర్టు పరిధిలో ఉన్న ఆధారాలను తగలబెట్టారని ఆరోపణలు చేయడమేంటి? సిరిసిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందన్నారు.






