బ్లాక్ లిస్టులో బొమ్మరాసిపేట భూములు.. కోర్టుకెక్కిన భూ వివాదాలు

by Disha Web |
బ్లాక్ లిస్టులో బొమ్మరాసిపేట భూములు.. కోర్టుకెక్కిన భూ వివాదాలు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : బొమ్మరాసి పేట వివాదాస్పద భూములు బ్లాక్ లిస్టులోకి వెళ్లాయి. ఈ భూముల క్రయ విక్రయాలు జరగకుండా తాజాగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం, బొమ్మరాసి పేట రెవెన్యూ సర్వే నెంబర్లు 323 నుంచి 409 లో ఉన్న 1045 ఎకరాల భూములపై వివాదం నడుస్తున్న విషయం విధితమే. దీంతో ఈ సర్వే నంబర్లకు సంబంధించిన భూములన్నీంటినీ అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టారు.

భూముల చరిత్ర ఇదీ..

మేడ్చల్ జిల్లా, శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేటలో సర్వే నెంబరు 323 నుంచి 409లో ఉన్న 1,045 ఎకరాల భూములను 1965లో ఉమ్మడి రాష్ట్రంలో మాజీ రాజ్య సభ్యుడు దుగ్గిరాల బలరామకృష్ణయ్య తన కుటుంబీకులు, బంధువుల పేరిట కొనుగోలు చేశారు. కాగా ఈ భూములన్నీ 1960 సంవత్సరానికి ముందర ముస్లీంల పేరిట ఉన్నాయి. కాగా ఈ భూములను కొనుగోలు చేసిన అనంతరం బాలరామకృష్ణయ్య 21 మంది పేరున పౌతి పట్టాగా చేశారు. ఈ భూములన్నింటిని 1965 నుంచి 1970 లోపు 95 మంది రైతులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, ఇతరులు కొన్నారు. ఈ భూములన్నీ 95 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పట్టాపాసు పుస్తకాలూ వచ్చాయి. రెవెన్యూ రికార్డుల్లోనూ వీరే ఉన్నారు. దశాబ్దాలుగా కూరగాయ, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. కాగా ఇటీవల రైతుల రిజిష్టర్డ్ ఫోన్ నెంబర్లకు మేసేజ్‌లు రావడం కలవరానికి గురి చేసింది.

వివాదం ఇలా..

ప్రశాంతంగా ఉన్న రైతుల జీవితాల్లో ఇపుడు అలజడి మొదలైంది. బలరామకృష్టయ్య వారసులమంటూ కొందరు ఈ భూములపై కోర్టులో దావావేశారు. వీరితో పాటు దుగ్గిరాల కుటుంబం తమకు జీపీఏ ఇచ్చిదంటూ యుగేందర్‌ బాబు అనే వక్తి 2016లో 95 రిజిస్ట్రేషన్ల ద్వారా 126 ఎకరాలు 31 మందికి రిజిస్ట్రేషన్లు చేశాడు. 323 నుంచి 409 తొమ్మిది సర్వే నెంబర్లలోని 1,045 ఎకరాల్లో 126 ఎకరాల మేర రిజిస్ట్రేష న్లు జరిగాయి. ఎల్‌బీనగర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో పని చేస్తున్న రమేష్ చంద్ర అనే సబ్‌రిజిస్ట్రార్‌ ఈ భూములన్నింటికీ ఆధారాలు లేకుండానే రిజిస్ట్రేషన్‌ చేశాడని రైతులు తెలిపారు. ఈ అధికారి అవినీతి కేసులో సస్పెండ్‌ అయ్యారు. దుగ్గిరాల వారసులుగా చెప్పుకుంటున్న వారు రెవెన్యూ కోర్టులను ఆశ్రయించారు. ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌ కోర్టుల ఉత్తర్వులు వీరికి అనుకూలంగా వచ్చాయి.

దీనిపై రైతులు హైకోర్టుకు వెళ్లగా కలెక్టర్‌ మరోసారి విచారించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ భూములపై వివాదాలున్నందున కోర్టులోనే తేల్చుకోవాలని అప్పటి కలెక్టర్‌ శ్వేతా మహంతి సూచించారు. దుగ్గిరాల బలరామకృష్ణయ్య వారసులుగా చెప్పుకుంటున్న వారు, మరొకరూ హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారించి ఆరు వారాల్లో వీరి పేర్లు రికార్డుల్లో చేర్చాలని కోర్టు రెవెన్యూ అధికారులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులతో వీరంతా మ్యుటేషన్‌ కోసం మీసేవల్లో దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు ఉత్తర్వులు, అధికారులు తీసుకున్న చర్యలపై కేవీ. రమణారెడ్డి అనే రైతు హైకోర్టును ఆశ్రయించారు. వివాదాలు లేకున్నా ఒకే సర్వే నెంబర్‌ కారణంగా తమ భూములనూ బ్లాక్‌ చేశారని విన్నవించారు. దీనిపై కోర్టు స్పందించి ఇక్కడ భూములు అనుభవిస్తూ పట్టాదారుపాస్‌ పుస్తకాలున్న రైతులకు నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను తాము ధరణిలో అప్లోడ్‌ చేసినా ఇంత వరకు న్యాయం జరగడం లేదని రైతులంటున్నారు.

నోటీసులు జారీచేసి విచారణ జరుపుతాం.. కలెక్టర్


బొమ్మరాసి పేట వివాదస్పద భూముల విషయమై నోటీసలు జారీ విచారణ జరుపుతాం. అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. కాగా 2018లో ఇవే భూములు వేరే పేరిట మారడంతో ఈ భూముల పరిష్కారానికి బ్లాక్ లో పెట్టారు. 2021 జూలై లో భూముల లెక్క తేల్చాలని కోర్టు తీర్పు ఉంది. ప్రస్తుతం తహశీల్దార్ నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతారు. అర్హులైన వారికి పంపిణీ చేస్తారు. ప్రస్తుతం ఉన్న పేర్లను మార్చలేదు. కేవలం బ్లాక్ లిస్టులోనే ఉన్నట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed