ఇండియా జెట్స్‌పై ఆరు దేశాలు ఆసక్తి

by Disha Web |
ఇండియా జెట్స్‌పై ఆరు దేశాలు ఆసక్తి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ తన రక్షణ రంగాన్ని రోజురోజుకూ పటిష్టం చేసుకుంటుంది. తనకు కావాల్సిన ఆయుధాలను, పరికరాలను స్వతహాగా తయారు చేసే దిశగా భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే భారత్ తాజాగా తన జెట్ విమానాలను తయారు చేసింది. భారత తేజాస్ ఫైటర్ జెట్స్‌ను హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారు చేసింది. అయితే తాజాగా హెచ్ఏఎల్ 18 ఫైటర్ జెట్స్‌ను మలేషియాకు ఆఫర్ చేసింది. అంతేకాకుండా భారత్ ఫైటర్ జెట్స్‌ను కొనుగోలు చేసేందుకు మరో ఆరు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, యూఎస్ఏ, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలు ఇప్పటికే అవి భారత తయారీ తేజస్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాయి.

ఈ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్‌లను తాము కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే 1983లో వీటికి మొదటిసారిగా ఆమోదం లభించింది. అప్రూవల్ వచ్చిన దశాబ్దాల తర్వాత వీటిని 2023 నాటకి 83 జెట్లను డెలివరీ చేసేందుక ప్రభుత్వం 6 బిలియన్ డాలర్ల కాంట్రాక్స్‌ హెచ్ఏఎల్‌కు ఇచ్చింది. విదేశీ రక్షణ పరికరాలపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ జెట్ విమానాలను ఎగుమతి చేసేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా వీటి విషయంలో డిజైన్ సహా మరిన్ని ఇతర సవాళ్లతో కూడుకుంది. దాంతో పాటుగా అవి అత్యంత బరువుగా మారుతాయని ఒకప్పుడు భారత్ నౌకాదళం వీటిని తిరస్కరించింది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed