రేపటి నుంచి చికెన్ షాపుల బంద్ పై అసోసియేషన్ కీలక ప్రకటన

by Malleboina Mahesh |

ఏప్రిల్ 1న తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపుల బంద్. కమీషన్ మార్జిన్ తగ్గింపుపై నాచారం అసోసియేషన్ నిరసన. ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నాకు పిలుపు.

రేపటి నుంచి చికెన్ షాపుల బంద్ పై అసోసియేషన్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో చికెన్ షాపుల బంద్‌ (Chicken shops Bandh)కు చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అలాగే హైదరాబాద్‌ మహా నగరంలో కూడా చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ (Chicken Shop Owners Association) ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరగనుంది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే కమీషన్ మార్జిన్‌ను తగ్గించడం వల్ల తీవ్ర నష్టాలు వస్తున్నాయని చికెన్ షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 1.8 గా ఉన్న మార్జిన్‌ను ప్రస్తుతం 1.5కి తగ్గించడమే ఈ బంద్‌కు ప్రధాన కారణమని వారు పేర్కొన్నారు.

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చికెన్ షాపుల యజమానులందరూ ఈ బంద్‌లో పాల్గొని, దీనిని విజయవంతం చేయాలని నాచారం అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మార్జిన్ పెంపుపై పౌల్ట్రీ కంపెనీలు స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. అలాగే అసోసియేషన్ నిర్ణయాన్ని కాదని షాపులు తెరిచే వారిపై కఠినంగా వ్వహరిస్తామని ఈ సందర్భంగా తెలంగాణ చికెన్ షాప్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.

Next Story