ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థిపై కాల్పులు

by Disha Web |
ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థిపై కాల్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ గంగా కింద ఉక్రెయిన్ నుండి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే శుక్రవారం కీవ్‌లో ఒక భారతీయ విద్యార్థిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ విద్యార్థిని చికిత్స కోసం మళ్లీ కీవ్‌కు తరలించాల్సి వచ్చింది. విద్యార్థులు ప్రస్తుతం యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్ నుండి పారిపోయి సురక్షితంగా భారతదేశానికి తిరిగి రావడానికి పోలాండ్ సరిహద్దుకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

"కీవ్‌ నుండి వస్తున్న ఒక విద్యార్థిపై కాల్పులు జరిపారిని మాకు తెలిసింది. వీలైనంత వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వారిని తరలించడానికి తీవ్ర ప్రయత్నానాలు చేస్తున్నాం" అని పోలాండ్‌లోని MoS సివిల్ ఏవియేషన్ జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ అన్నారు. కాగా, నలుగురు కేంద్ర మంత్రులు, హర్దీప్ సింగ్ పూరీ, జ్యోతిరాదిత్య ఎం సింధియా, కిరెన్ రిజిజు మరియు జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ - ఉక్రెయిన్‌కు ఆనుకుని ఉన్న దేశాల్లో తరలింపు ప్రయత్నాలను పర్యవేక్షిస్తున్నారు.

Next Story

Most Viewed