ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ల ఖాళీలన్నీ భర్తీ చేయాలి.. కేసులు వీగిపోకుండా చూడాలి

by Disha Web |
ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ల ఖాళీలన్నీ భర్తీ చేయాలి.. కేసులు వీగిపోకుండా చూడాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ల ఖాళీలన్నీ భర్తీ చేసి కోర్టుల్లో కేసులు వీగిపోకుండా చూడాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి కోరారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. క్రిమినల్ కేసుల ప్రాసిక్యూషన్ లో 10 శాతంలోపే దోషులకు శిక్ష పడగా 90 శాతానికి పైగా కేసులు న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితి ఆందోళన కలిగించే విషయమని, ప్రజలకు పోలీసు, న్యాయ వ్యవస్థ పనితీరుపై సందేహాలు కలుగుతున్నాయన్నారు. చాలా సందర్భాల్లో ఒక్కొక్క ప్రాసిక్యూటింగ్ అధికారి రెండు మూడో కోర్టులలో షిప్టుల వారీగా వివిధ మండలాలు, జిల్లాల్లో పనిచేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు.

రాష్ట్రంలో 400 మంది ప్రాసిక్యూటింగ్ అధికారులు ఉండాల్సి ఉండగా కేవలం 219 మంది మాత్రమే పని చేస్తున్నారని, సుమారు 181 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఖాళీ పోస్టుల్లో అధికారులను నియమించకపోవడంతో కొందరు న్యాయవాదులకు టెన్యూర్ బేసిస్ తీసుకుంటున్నారని, ఈ పద్ధతిన వచ్చేవారు చాలా మటుకు రాజకీయ నాయకుల అండదండలతో వస్తున్నారన్నారు. టెన్యూర్ పద్ధతికి స్వస్తి పలికి రెగ్యులర్ అపాయింట్‌మెంట్ చేయాలని కోరారు. కేసులు త్వరితగతిన తీర్పు వచ్చి దోషులకు శిక్షపడితేనే ప్రజలకు పోలీసు, న్యాయవ్యవస్థపై నమ్మకం కుదురుతుందన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed