సినిమాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నా.. అమీర్‌ఖాన్

by Dishafeatures2 |
సినిమాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నా.. అమీర్‌ఖాన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలోనే సినిమాల నుంచి శాశ్వతంగా తప్పుకోబోతున్నట్లు లేటెస్ట్ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేందుకే ఈ ఆలోచన చేసినట్లు తెలిపాడు. 'సినిమాకు రిటైర్మెంట్ ప్రకటిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే పిల్లలకు అస్సలు టైమ్ ఇవ్వలేకపోతున్నా. వాళ్లకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో తెలియడం లేదు. అదో పెద్ద సమస్యగా మారింది. నా మీదే కాకుండా సినిమా మీద కూడా అసహనం పెరిగిపోతోంది. మొత్తానికి కుటుంబానికి, నాకు మధ్య గ్యాప్‌ పెంచుతున్నది సినిమాలేనని అర్థమయ్యేందుకు ఇంతకాలం పట్టింది. అందుకే మూవీస్‌కు గుడ్ బై చెప్పాలనుకున్నా' అని వెల్లడించాడు. ఇకపై నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టనన్న అమీర్.. మరో 3, 4 ఏళ్ల తర్వాత శాశ్వతంగా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటానని పేర్కొన్నాడు.



Next Story

Most Viewed