చూయింగ్ గమ్‌ బెలూన్స్‌తో రూ. వేలు సంపాదిస్తున్న మహిళ..

by Disha Web |
చూయింగ్ గమ్‌ బెలూన్స్‌తో రూ. వేలు సంపాదిస్తున్న మహిళ..
X

దిశ, ఫీచర్స్ : కూటి కోసం కోటి విద్యలని పెద్దలు ఏనాడో చెప్పారు. నిజానికి జీవనోపాధికి ఎన్నో దారులున్నా.. చదువుకు తగ్గ ఉద్యోగాలు లభించక చాలామంది నిరాశతో బతుకీడుస్తున్నారు. అయినా చింతించకుండా టాలెంట్ అండ్ క్రియేటివిటీతో పైకొచ్చిన వారూ లేకపోలేదు. అదే కోవకు చెందిన ఓ మహిళ.. తనకు చదువు లేకపోయినా సొంత టాలెంట్‌తో నెలకు £700(రూ. 67,000) సంపాదిస్తోంది.

జర్మనీకి చెందిన 30 ఏళ్ల జూలియా ఫోరట్.. ముప్పై బబుల్ గమ్ ముక్కలను నోటితో ఊది నెలకు రూ. 67 వేలకు పైగా సంపాదిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం తనకు నెలకు రూ. 480 మాత్రమే ఖర్చవుతున్నట్లు తెలిపింది. ఈ సీక్రెట్ గురించి కొందరికే తెలుసని చెప్పిన జూలియా ఆ వివరాలను పంచుకుంది. 'చూయింగ్ గమ్ ద్వారా సంపాదించవచ్చని నా స్నేహితుడు చెప్పాడు. కొన్ని పరిశోధనల తర్వాత నిజమేనని నిర్ధారించుకుని ఈ ప్రయత్నం చేశాను. దీంతో బెలూన్స్‌ ఊదిన చిత్రాలను My.Club, ఆన్‌లైన్‌లో షేర్ చేయడం ప్రారంభించాను. ఇది పలువురి దృష్టిని ఆకర్షించింది. ఎక్కడా దొరకనటువంటి కంటెంట్‌ను అందించడం పట్ల నా అభిమానులు సంతోషిస్తున్నారు' అని పేర్కొంది. ఇక దీని ద్వారా వచ్చే అదనపు ఆదాయాన్ని తరచుగా చికిత్స కోసం ఉపయోగిస్తానని ఆమె వివరించింది.


Next Story

Most Viewed