టీనేజ్​ కూతుళ్లతో పోటీపడి చదువుకుంటున్న 53 ఏళ్ల తల్లి

by Disha Web |
టీనేజ్​ కూతుళ్లతో పోటీపడి చదువుకుంటున్న 53 ఏళ్ల తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: చదువుకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది ఓ ఇల్లాలు. తన కూతుళ్లతో కలిసి 10వ, తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది ఈ మహిళ. త్రిపురకు చెందిన షిలారాణి దాస్ (53) అనే మహిళ 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరైంది. మరోవైపు ఆమె కూతుళ్లు కూడా ఇంటర్ పరీక్షలు రాశారు. బుధవారం 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను వెలువడ్డాయి.ఈ ఫలితాల్లో ఆమె పిల్లలు ఇంటర్ పరీక్షలు పాస్ కాగా.., షిలా రాణి దాస్ పది ఫలితాల్లో సత్తాచాటారు. కాగా ఆమె చదువు మానేసి 28 ఏళ్ల తర్వాత, త్రిపుర బోర్డ్ పరీక్షలకు హాజరై.. ఈ ఏడాది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. పదో తరగతి పాస్ అయినందుకు నేను సంతోషంగా ఉన్నానని, నా కుమార్తెలు నాకు మద్దతు ఇచ్చారని షిలా రాణి చెప్పకొచ్చింది. షీలా దాస్‌కు చిన్న వయస్సులోనే వివాహం కావడంతో చదువు ప్రయత్నాలు అక్కడే ఆగిపోయాయి. కొన్నాళ్ల తర్వాత కుమార్తెలిద్దరూ తమ తల్లిని బోర్డు పరీక్షలు రాయడానికి కృషి చేశారు. దీంతో తమ పిల్లలు ఇంటర్ పాస్‌కాగా, తను పదో తరగతి పాస్ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed