250 మంది డాక్టర్లు బదిలీ.. పేషెంట్ల రద్దీ ప్రకారం కేటాయింపులు

by Dishafeatures2 |
250 మంది డాక్టర్లు బదిలీ.. పేషెంట్ల రద్దీ ప్రకారం కేటాయింపులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్య శాఖలో 250 మంది డాక్టర్లు బదిలీ కానున్నారు. ఇప్పటికే ప్రాసెస్ ​అంతా పూర్తయింది. ఉత్తర్వులు రాగానే డాక్టర్లు కొత్త పోస్టింగ్‌లలోకి చేరాల్సి ఉంటుంది. సర్కారీ దవాఖానాల్లో రేషనలైజేషన్ చేయాలని ప్రభుత్వం గత కొన్ని రోజుల నుంచి కసరత్తులు చేస్తున్నది. పేషెంట్ల రద్దీ ప్రకారం స్టాఫ్​ను కేటాయించాలని భావించింది. అందుకోసం తెలంగాణ వైద్య విధాన పరిషత్​, డైరెక్టర్​ ఆఫ్​ మెడికల్ ఎడ్యుకేషన్​, పబ్లిక్​ హెల్త్​ విభాగాల్లో స్టాఫ్​ సర్దుబాట్ల ప్రక్రియను షురూ చేసింది. అవసరాల మేరకు మాత్రమే డాక్టర్లను ఆసుపత్రులకు కేటాయించాలని ప్లాన్ చేశారు. తొలి విడత తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని జిల్లా, ఏరియా హాస్పిటళ్లలో పనిచేస్తున్న సుమారు 250 మంది డాక్టర్లను బదిలీ చేయాలని నిర్ణయించారు. కొన్ని ఆసుపత్రుల్లో అవసరానికి మించి డాక్టర్లు ఉండగా, మరి కొన్నింటిలో డాక్టర్ల కొరత వేధిస్తోంది. దీంతో అన్ని ఆసుపత్రులకు సమస్యలు లేకుండా డాక్టర్లను అడ్జెస్ట్ ​చేయనున్నారు. 250 డాక్టర్లు కొరత ఉన్న హాస్పిటళ్లకు పంపించనున్నారు. దీంతో పాటు పబ్లిక్​ హెల్త్​, డీఎంఈ విభాగాల్లోనూ స్టాఫ్​ను సర్దుబాట్లు చేయనున్నారు. ఆ తర్వాత స్టాఫ్​ నర్సులు, ల్యాబ్​ టెక్నీషియన్లు కూడా కొరత ఉన్న ఆసుపత్రుల్లోకి సర్దుబాట్లు చేయనున్నారు.

నర్సులతో నెట్టుకొస్తూ..

ప్రస్తుతం కొన్ని చోట్ల పీహెచ్‌సీలను స్టాఫ్​ నర్సులతో నెట్టుకొస్తున్నారు. పైగా అవన్నీ రూరల్​ ఏరియాల్లోనే ఉండటం గమనార్హం. దీంతో అలాంటి చోట కనీసం ఒక్క డాక్టర్ ఉండేలా సర్దుబాట్లు చేయాలని సీరియస్​గా దృష్టి పెట్టింది. కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో పేషెంట్లు రద్దీ లేకపోయినా డాక్టర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఏళ్ల తరబడి నుంచి ఇదే విధానంతో నెట్టుకొస్తున్నారు. దీంతో అవసరమైన ఆసుపత్రులకు డాక్టర్ల కొరత ఏర్పడుతుంది. బదిలీలు చేసేందుకు ప్రయత్నించినా, పొలిటికల్ ​రికమండేషన్లతో ఆఫీసర్లు కూడా వెనకడుగు వేయాల్సి ఉన్నది. ఇలాంటి పరిస్థితికి చెక్​ పెట్టేందుకే ప్రభుత్వం రేషనలైజేషన్​ విధానాన్ని అమలు చేస్తుందని ఓ అధికారి చెప్పారు.


Next Story

Most Viewed