నీలి చొక్కాలతో రండి.. పోరాటం చేద్దాం

by Disha Web Desk |
నీలి చొక్కాలతో రండి.. పోరాటం చేద్దాం
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాదిగలకు 12 శాతం రిజర్వేషన్​కల్పించాల్సిన అవసరం ఉన్నదని ఎస్సీ కార్పొరేషన్​ మాజీ చైర్మన్​ పిడమర్తి రవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సబ్బండ వర్గాల హక్కుల పోరాటం కోసం ఏప్రిల్ 14న ఎస్సీ ,ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో బాగ్​లింగంపల్లి సుందరయ్య పార్క్ నుంచి ట్యాంకుబండ్‌లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు శోభ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ యాత్రలో పాల్గొనే అన్ని సంఘాల నాయకులు, కార్యకర్తలు నీలి చొక్కాలు ధరించి రావాలని పిలుపు నిచ్చారు. బీసీలకు 50% రిజర్వేషన్ , రజకులను ఎస్సీ జాబితాలోకి చేర్చడం, ముస్లింలకు ,గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్, ఎస్సీల కు 20 శాతం రిజర్వేషన్ కల్పించే అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గోపి, భిక్షపతి, ఎండల ప్రదీప్, మైస ఉపేందర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed