జూనియర్ ఎన్టీఆర్‌కు షాక్ ఇచ్చిన మహిళ.. హై కోర్టును ఆశ్రయించిన తారక్

by Rajesh |
జూనియర్ ఎన్టీఆర్‌కు షాక్ ఇచ్చిన మహిళ.. హై కోర్టును ఆశ్రయించిన తారక్
X

దిశ, వెబ్‌డెస్క్: భూవివాదంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్లాట్ విషయంలో వివాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో 2003లో గీతా లక్ష్మీ అనే మహిళ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ప్లాట్ కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఫేక్ డాక్యుమెంట్స్‌తో 5 బ్యాంకుల నుంచి గీతా లక్ష్మీ లోన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. విషయాన్ని దాచిపెట్టి ఎన్టీఆర్‌కు ప్లాట్‌ను మహిళ అమ్మేశారు. తాజాగా ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు యత్నించాయి. దీంతో బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. 2019లో ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ వేశారు. తాజాగా డీఆర్టీ‌లో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించగా జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. .

Read More..

జూనియర్ ఎన్టీఆర్ స్థల వివాదం కేసు జూన్ 6 న విచారణ!

Next Story

Most Viewed