106ఏళ్ల ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ.. అంతరించిపోతున్న వారసత్వ జాబితాలో విలీనం

by Disha Web Desk |
106ఏళ్ల ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ.. అంతరించిపోతున్న వారసత్వ జాబితాలో విలీనం
X

దిశ, ఫీచర్స్ : బీహార్‌లోని ముజఫర్ పూర్‌లో అంతరించిపోతున్న 106ఏళ్ల పురాతన ఖగోళ అబ్జర్వేటరీ యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడింది. 1916లోని బీహార్ ముజఫర్ పూర్‌లో కాలేజీ విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడానికి తూర్పు భారతదేశంలో మొట్టమొదటగా ఆస్ట్రానామికల్(ఖగోళ శాస్త్ర) అబ్జర్వేటరీని స్థాపించారు. అయితే అబ్జర్వేటరీ పరిస్థితి క్రమక్రమంగా క్షీణించడంతో యంత్రాలు కొన్ని పోవడం.. మరికొన్ని డస్ట్‌తో నిండిపోయి ఉన్నాయి. దీంతో ఈ ఖగోళ అబ్జర్వేటరీని యునెస్కో అంతరించిపోతున్న వారసత్వ జాబితాలోకి చేర్చబడింది.

కొన్ని సంవత్సరాల క్రితం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అబ్జర్వేటరీని సందర్శించినపుడు.. దాని పునరుద్ధరణకు గ్రాంట్లు ఇస్తామని అధికారులకు హామీ ఇచ్చారు కానీ ఏమీ జరగలేదు.'ఇప్పుడు, యునెస్కో అంతరించిపోతున్న వారసత్వ అబ్జర్వేటరీల జాబితాలో చేర్చిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం దాని పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాము' అన్నారు లంగత్ సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఓ.పి రాయ్. ఇక యునెస్కో జాబితాలో చేర్చిన ఘనత కూడా ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జేఎన్ సిన్హాకే దక్కుతుందని.. 'యునెస్కో దృష్టిని అబ్జర్వేటరీ వైపు ఆకర్షించడానికి ఆయన చేసిన నిరంతర ప్రయత్నాలు చివరకు ఫలించాయి' అని కాలేజీ సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు అభిప్రాయపడ్డారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed