చంద్రబాబు పాలు-కూరగాయలు అమ్ముకోవాల్సిందే : లక్ష్మీపార్వతి

by srinivas |
ysrcp leader lakshmi parvathi
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని చంద్రబాబు భ్రష్టుపట్టించారని ఆరోపించారు. చంద్రబాబు దుర్మార్గుడు, మోసకారి అంటూ ధ్వజమెత్తారు. మున్సిపల్, కార్పోరేషన్‌ ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయ్యిందని లక్ష్మీపార్వతి అన్నారు. ఇకపై చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ పాలు, కూరగాయలు అమ్ముకోవాల్సిందేనని ఆమె ఎద్దేవా చేశారు. ఇప్పటికీ చంద్రబాబుకు ఆత్మవిమర్శ లేదన్నారు. నందమూరి తారకరామరావును అభిమానించే వారు చంద్రబాబును పక్కనపెట్టాలాని ఆమె కోరారు. ఇంకా 30 ఏళ్లపాటు రాష్ట్రంలో జగన్ పరిపాలన కొనసాగుతుందని లక్ష్మీపార్వతి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story