ఏప్రిల్ నుంచి ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్న టెలికాం కంపెనీలు!

by  |
ఏప్రిల్ నుంచి ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్న టెలికాం కంపెనీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఇంటర్నెట్‌తో పాటు ఫోన్ కాల్స్ మరింత భారం కానున్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి టెలికాం సంస్థలు రేట్లను పెంచేందుకు సిద్ధమవుతున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ సంస్థ ఇక్రా తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో డేటా, ఫోన్ కాల్ ధరలను పెంచనున్నాయి.

ఏప్రిల్ 1 తర్వాత ఎంత మేరకు ధరల పెంపు ఉంటుందనే దానిపై స్పష్టత రానుంది. ఇప్పుడున్న 2జీ వినియోగదారులను 4జీకి అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఫోన్‌కాల్స్, ఇంటర్నెట్ ధరలను పెంచి వినియోగదారు సగటు ఆదాయం(ఆర్పు)ను మెరుగుపరచాలని భావిస్తున్నట్టు ఇక్రా పేర్కొంది. ఈ చర్యల ద్వారా కంపెనీల ఆదాయం రానున్న రెండేళ్లలో 11 శాతం నుంచి 13 శాతానికి పెరుగుతాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ విద్య వంటి మార్పులతో ఇంటర్నెట్, ఫోన్ కాల్స్ వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed