మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తిడితే ఊరుకుంటామా?: కోమటిరెడ్డి

by Disha Web Desk 2 |
మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తిడితే ఊరుకుంటామా?: కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన నివాసంలో పార్టీ సీనియర్లు కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ చేరికలు, రోడ్ మ్యాప్‌పై చర్చించారు. అనంతరం వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల యాక్షన్ ప్లాన్‌పై చర్చించినట్లు తెలిపారు. పీఏసీ సమావేశంలో బస్సుయాత్రపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కేసీఆర్‌లా ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి తెలియదని విమర్శించారు. ఈ నెలాఖరులో జరిగే ప్రియాంక గాంధీ సభకు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరు కావడమే కాకుండా.. పార్టీ సీనియర్లంతా హాజరు కాబోతున్నారని తెలిపారు.

ఈ సభలో మహిళా డిక్లరేషన్‌పై ప్రకటన చేస్తామని వెల్లడించారు. ఎన్నికలు సమీపిస్తుండంతో కేసీఆర్ కొత్త మోసానికి సిద్ధమయ్యాడని, ఈ క్రమంలో కొత్త పథకాలు అంటూ మరో మోసానికి రెడీ అవుతున్నాడని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసీఆర్‌కు దమ్ముంటే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి తలసాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, మా పార్టీ అధ్యక్షుడిని తిడితే ఊరుకుంటామా? అని వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బీసీలను ఏమీ అనలేదని అన్నారు. అనవరస ఆరోపణలు చేసి, కాంగ్రెస్‌పై బురద జల్లాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

Also Read: ఎంపీ కోమటిరెడ్డి నివాసంలో కీలక భేటీ.. మూడు గంటల పాటు సస్పెన్స్!



Next Story

Most Viewed