- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మేం ముగ్గురం పార్టీ మారడానికి మెయిన్ రీజన్ అదే: విజయశాంతి
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ఎంతవరకైనా కొట్లాడతది అని చెప్పి తనను, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను ఒప్పించి బీజేపీలో చేరేలా చేశారని మాజీ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. గతంలో బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు అనేక మంది బీజేపీ ప్రముఖులు బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తేనే బీజేపీలో చేరినట్లు గుర్తుచేశారు. కానీ, బీజేపీ ఇందుకు భిన్నంగా వ్యవహరించడంతోనే పార్టీ నుంచి బయటకు వచ్చేశామన్నారు. రాష్ట్రంలోని దుర్మార్గ పాలన పోవాలని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుంటే చాలు అన్న ఒకే ఒక్క కారణంతో పార్టీలు మారాల్సి వచ్చిందన్నారు.
ఇకపై ఎన్నికల ప్రచారం జెట్ స్పీడ్‌లో కొనసాగుతుందని మాజీ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. ఆదివారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రచార సమన్వయం కోసం కమిటీలు వేశామన్నారు. 28 వరకు పక్కా వ్యూహాం రెడీ అయిందన్నారు. పీసీసీ, ఏఐసీసీ ఆదేశాలతో ప్రచారం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ 80 సీట్లతో పవర్‌లోకి వస్తుందన్నారు. ఇక కొంత మంది తనపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని, అవే నా దీవెనలుగా భావిస్తానని చెప్పారు. కిసాన్ జాతీయ అధ్యక్షుడు కోదండరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ చేస్తున్న అబద్దాలను తిప్పి కొడతామన్నారు. ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. మల్లు రవి మాట్లాడుతూ.. ప్రచారం, ప్రణాళిక బాధ్యతలు అందరికీ అప్పగించామన్నారు. మరో పదిహేను రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.