బీఆర్ఎస్‌లోకి నేడు మరో ఇద్దరు.. కండువా కప్పనున్న సీఎం కేసీఆర్

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్‌లోకి నేడు మరో ఇద్దరు.. కండువా కప్పనున్న సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస చేరికలతో మాంచి జోష్ మీదున్న కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. కాంగ్రెస్ కీలక నేత చెరుకు సుధాకర్, తెలంగాణ టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ నేడు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సమక్షంలో వీరిద్దరూ గులాబీ కండువా కప్పుకోనున్నారు. మామిళ్ల రాజేందర్ నిన్న తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. డిపార్టుమెంటులో ఇరవై సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకోవడంతో స్వచ్చందంగా పదవీ విరమణ చేస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఆమోదం లభించింది. వ్యక్తిగత కారణాలతో రిటైర్ కావాలనుకుంటున్నట్లు అందులో రాజేందర్ పేర్కొన్నారు.


మరోవైపు బీఆర్ఎస్‌లో చేరాలని గురువారం చెరుకు సుధాకర్‌ను మంత్రి జగదీశ్ రెడ్డి కలిసి రిక్వెస్ట్ చేశారు. అనంతరం కేటీఆర్, హరీశ్ రావు కూడా సుధాకర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. చెరుకు సుధాకర్‌తో గొడవ తారా స్థాయికి చేరి ఎంపీ కోమటిరెడ్డి వేముల వీరేశంను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇప్పించుకోవడంతో చెరుకు సందిగ్ధంలో పడిపోయారు. దీంతో ఇదే అదునుగా భావించిన గులాబీ నేతలు ఆయన్ను బీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు నిర్ణయించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి కూడా సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరనున్నారు.


Read More..

మాంచి జోష్ మీదున్న కాంగ్రెస్‌కు BIG షాక్.. నేడు పార్టీకి కీలక నేతలు రాజీనామా



Next Story

Most Viewed