రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన BRS ఎమ్మెల్యే కూతురు?

by Disha Web Desk 2 |
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన BRS ఎమ్మెల్యే కూతురు?
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి త‌న‌య తుల్జాభ‌వాని రెడ్డి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా నియోజ‌క‌వ‌ర్గంలో టాక్ న‌డుస్తోంది. ప‌లు భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తండ్రి ముత్తిరెడ్డిని ఆమె ఎక్కడిక‌క్కడ ఇటీవ‌ల జ‌నం మ‌ధ్యలో ప్రశ్నించ‌డంతో ఆమెకు జ‌నం నుంచి అభినందనలు వచ్చాయి. రాజ‌కీయాల‌కు అతీతంగా ఆమె ధైర్యాన్ని, తెగువ‌ను, నిజాయితీని కొనియాడారు. తాజాగా ఆమె జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాజ‌కీయ రంగ ప్రవేశం చేయ‌బోతున్నార‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతోంది. రాజ‌కీయాల్లోకి వ‌స్తే ఖ‌చ్చితంగా ఆద‌ర‌ణ ఉంటుంద‌ని ఆమె స‌న్నిహితులు సూచ‌న‌లు చేస్తున్నట్లుగా, రాజ‌కీయ ప్రవేశంపై ఆమె సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నట్లుగా ప్రచార సారాంశం. అయితే ముత్తిరెడ్డిని ఎదురించి జ‌నంలోకి వ‌స్తున్న త‌న‌యకు ఖ‌చ్చితంగా పొలిటిక‌ల్ వేవ్ ఉంటుంద‌న్న విశ్లేష‌ణ‌లు కొన‌సాగుతున్నాయి.

తండ్రిని నిల‌దీయ‌డంతో పాపులారిటీ..!

భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తండ్రి ముత్తిరెడ్డిని కొద్దిరోజులుగా తుల్జా భ‌వాని రెడ్డి ప్రశ్నించ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. చేర్యాల పెద్ద చెరువు మ‌త్తడి భూమిని ఆక్రమించుకుని తుల్జా భ‌వాని రెడ్డి పేరు మీద రిజిస్ట్రేష‌న్ చేయ‌డాన్ని ఆమె త‌ప్పుబ‌ట్టింది. ఎమ్మెల్యేగా ఉంటూ నా తండ్రి యాదగిరిరెడ్డి ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్‌ చేయడం తప్పని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు రూ.వెయ్యి కోట్ల ఆస్తులున్నాయని. అయినా ఆయన ఇలా చేయడం సరికాదన్నారు. తప్పు జరిగిపోయిందని, క్షమించాలని అన్నారు. ‘‘నా తండ్రి ఊరి భూమి కబ్జా చేసి నా పేరున రిజిస్ట్రేషన్‌ చేసినందుకు నేను చేర్యాల ప్రజలను క్షమాపణ కోరుతున్నాను’’ అంటూ భవానీ పేర్కొన్నట్లుగా ఉన్న బోర్డును ఆ స్థలంలో పెట్టారు.



Next Story

Most Viewed

    null