నిరూపిస్తే.. ఆస్తులన్నీ ప్రజలకు పంచుతా: బండి సంజయ్

by GSrikanth |   ( Updated:2023-11-24 15:16:57.0  )
నిరూపిస్తే.. ఆస్తులన్నీ ప్రజలకు పంచుతా: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు కేసీఆర్ ఇచ్చేది కేవలం రూ.10 వేలు మాత్రమేనని.. ప్రధాని మోడీ రూ.24 వేలు ఇస్తున్నాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే వరికి కనీస మద్దతు ధర రూ.3100 ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. తెలంగాణను ఇంతకాలం పాలించిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లది కబ్జాల చరిత్ర అని.. తమది పోరాటాల చరిత్ర అని విమర్శించారు.

కేటీఆర్ గొప్పగా చెప్పుకుంటున్న కరీంనగర్ ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయని ఎద్దేవా చేశారు. జిల్లాకు ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేని దద్దమ్మ మంత్రి గంగుల కమలాకర్ సీరియస్ అయ్యారు. ఎన్నికలు కాగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కటై కేసులు సెటిల్ చేసుకుంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు నిరూపిస్తే.. అవన్నీ ప్రజలకు పంచేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం పోరాడుతున్న బీజేపీకి ఒక్క ఓటు వేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

Also Read..

బండి సంజయ్ మాయ మాటలు చెప్పే ఓ డ్రామా ఆర్టిస్ట్: మంత్రి గంగుల ఫైర్

అవినీతి ఊడలమర్రి కల్వకుంట్ల ఫ్యామిలీ: MP లక్ష్మణ్ ఫైర్


Advertisement

Next Story