అధికారంలోకి రాగానే మేనిఫెస్టో మొత్తం అమలు చేయాలి

by Disha Web Desk 2 |
అధికారంలోకి రాగానే మేనిఫెస్టో మొత్తం అమలు చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చాయని.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి డిమాండ్ చేశారు. హైదరాబాద్ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి ప్రజలను మచ్చిక చేసుకోవడానికి అమలు కాని హామీలు ఎన్నో ఇస్తూ, అధికారంలోకి వచ్చాక వారు ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడం లేదన్నారు.

గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నేరవేర్చలేదన్నారు. కానీ, ఈసారి రాబోయే ప్రభుత్వం ప్రతీ హామీని అమలు చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. అమలు చేయపోతే తెలంగాణ ప్రజల తరపున నిరంతరం ప్రశ్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ జాతీయ సభ్యులు కొమటి రమేశ్ బాబు, మారియా అంతోని, బత్తిని రాజేశ్, సలహదారులు కానుగంటి రాజు, కార్యదర్శి కొన్నె దేవేందర్, ఈశ్వర్, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed