అసెంబ్లీలో కమ్యూనిస్టులు ఉండాలి.. కొత్తగూడెంలో గెలిపించే బాధ్యత నాదే: రేవంత్

by Disha Web Desk 2 |
అసెంబ్లీలో కమ్యూనిస్టులు ఉండాలి.. కొత్తగూడెంలో గెలిపించే బాధ్యత నాదే: రేవంత్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు కుదిరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని సీపీఐ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ చేస్తుందన్నారు. పొత్తులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు టిక్కెట్ కేటాయించామన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో చర్చలు జరిపి, ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. కాంగ్రెస్‌తో కలిసి నడవడానికి సీపీఐ సిద్ధపడిందన్నారు. కొత్తగూడెంలో సీపీఐ గెలుపు కోసం కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. సీపీఐకి రెండు ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించామన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటాడన్నారు. కమ్యూనిస్టు సోదరులు పేదల వైపు నిలబడాలన్నారు. ఇరు పార్టీల పెద్దల సమక్షంలో ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సీపీఐకి న్యాయం చేస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల్లోని కమ్యూనిస్టులు కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని కోరారు.



Next Story

Most Viewed