YS Sharmila ఆమరణ నిరాహార దీక్ష

by Disha Web Desk 2 |
YS Sharmila ఆమరణ నిరాహార దీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: 'ప్రజా ప్రస్థానం పాదయాత్ర'కు పోలీసులు అనుమతి నిరాకరించడంపై నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. అంతేగాకుండా.. కేసీఆర్ నియంతృత్వ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అదే అంబేద్కర్ ఎదుటచ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. జై భీమ్ నినాదాలు చేస్తూ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యా్ఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ పట్టపగలే ఖునీ చేశాడని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రశ్నిచే గొంతులను అణిచివేస్తున్నాడని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు, ప్రశ్నించే గొంతులను అణిచివేయడం భావ్యమేనా అని ప్రశ్నించారు. పాదయాత్ర ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చేస్తున్నామని గుర్తుచేశారు. 3500 కిలోమీటర్లు చేశాక ఇప్పుడు అడ్డుకోవడం ఏంటని అడిగారు. తమ పార్టీకి వచ్చే ఆదరణ చూసి కేసీఆర్ తట్టుకోవడం లేదని ఎద్దేవా చేశారు. మా యాత్రకు హైకోర్టు అనుమతి ఉన్నా కూడా కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నాడని అన్నారు.

Read More....

'లిక్కర్ డాన్ హటావో తెలంగాణ బచావో'.. ఇంటర్నెట్‌లో ఫోటోలు వైరల్



Next Story

Most Viewed